చేతిలో డబ్బులు లేవు.. అవకాశాలు లేవు.. దీనస్థితిలో ఉన్నా..

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ జీవితం తెరిచిన పుస్తకం.. ఆయన పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు.. ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి.. ఎంతోమందికి స్ఫూర్తిగా మారాడు. అసలు సినిమాలకే పనికిరాడు అని అన్నవారిచేతనే సూపర్ హీరో అని పిలిపించుకున్నాడు. అలాంటి ఈ యాంగ్రీ హీరో 70 ఏళ్ళ వయసులో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో తో బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు. అయితే ఒకానొక సమయంలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో చేయడానికి ఆలోచించానని తెలుపుతూ షోలోనే కంటనీరు పెట్టుకున్నాడు బిగ్ బి.

“2000 సంవత్సరం.. బుల్లితెరపై కేబీసీ మొదలుపెట్టాలని అనుకున్నప్పుడు వారు నన్ను అప్రోచ్ అయ్యారు.. ఆ సమయంలో చేతిలో డబ్బు లేదు.. అవకాశాలు లేవు.. ఏం చేయాలో తోచని దీన స్థితిలో ఉన్నా.. ఆ సమయంలో ఈ ఆఫర్ వచ్చింది.. కానీ , చాలామంది నన్ను వెనక్కి నెట్టారు. బుల్లితెరపై కనిపిస్తే చులకనగా చూస్తారు అని చెప్పారు.. స్థాయి తగ్గిపోతుందని భయపెట్టారు.. కానీ దైర్యం కూడకట్టుకొని ఒక అడుగు ముందుకేశాను.. కేబీసీ మొదటి ఎపిసోడ్ లో అడుగుపెట్టాను.. ఒక్క ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాకా వెనక్కి తిరిగి చూసుకోలేదు.. ఇప్పటికి ఈ షో వెయ్యి ఎపిసోడ్లు పూర్తి చేసుకొని రికార్డు సృష్టించింది ” అంటూ స్టేజి పైన్ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles