ప్రిన్స్ మహేశ్ ను ఢీ కొట్టబోతున్న యాక్షన్ కింగ్!

ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’లో ప్రతినాయకుడి పాత్రధారి విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. మ్యూజికల్ ఛైర్స్ గేమ్ తరహాలో ఒక్కోసారి, ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరి పేరు తెర ముందుకు వస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబుతో ఆన్ స్క్రీన్ పై పోరాడే వ్యక్తులు వీళ్ళే అంటూ కొన్ని పేర్లు వినిపించాయి. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో పాటు, ఆ మధ్య ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో నటించిన ఉపేంద్ర పేరూ పరిగణనలోకి వచ్చిందని అన్నారు. అలానే తమిళనాడుకు చెందిన పాపులర్ యాక్టర్ అరవింద్ స్వామి పేరుతో పాటు బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ పేరు ఆ జాబితాలో కనిపించిందని కొందరు చెప్పారు. తాజాగా ఇప్పుడీ రూమర్స్ అన్ని కూడా కన్నడ స్టార్, యాక్షన్ హీరో అర్జున్ దగ్గర వచ్చి ఆగాయి. అర్జున్ ట్రాక్ రికార్డ్, అతని యాక్టింగ్ ఎబిలిటీస్ ను దృష్టి లో పెట్టుకుని మహేశ్ బాబు సరసన ఇతనైతే బాగుంటుందని యూనిట్ సభ్యులు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇది కూడా గతంలో వచ్చిన పుకార్ల వంటిదేనా… లేకపోతే ఇందులో నిజం ఉందా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సింది. ఇదిలా ఉంటే కీర్తి సురేశ్ నాయికగా నటిస్తున్న ‘సర్కార్ వారి పాట’లో వెన్నెల కిశోర్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2022 సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్స్ సైతం అప్ అండ్ డౌన్ అయ్యాయి. కృష్ణ బర్త్ డే సందర్భంగా మూవీకి సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ మే 31న వస్తుందని అభిమానులు భావించారు కానీ, కరోనా పేండమిక్ సమయంలో అలాంటి ప్రకటనలేవీ చేయొద్దని మహేశ్ బాబు చెప్పాడట. దాంతో ఇవాళ ఓ రకంగా కృష్ణ, మహేశ్ ఫ్యాన్స్ భారీ నిరాశకు గురయ్యారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న’సర్కార్ వారి పాట’ సినిమాను జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి ఫోర్టీన్ రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-