ఆదిలాబాద్ జిల్లాలో దారుణం.. మహిళపై యాసిడ్ దాడి

ఆదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉట్నూరు మండలంలో గుర్తుతెలియని వ్యక్తులు మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డారు. లక్కారం పరిధిలోని కేబీనగర్‌లో ఈ దారుణం జరిగింది. మహిళపై యాసిడ్ పోసి దుండగులు పరారైనట్లు స్థానికులు చెప్తున్నారు. కాగా బాధిత మహిళను స్థానికులు హుటాహుటిన ఉట్నూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఉట్నూరు ప్రభుత్వాస్పత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మహిళపై యాసిడ్ దాడి ఎందుకు జరిగింది అన్న విషయంపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: మరిది మోజులో వదిన.. అర్ధరాత్రి వరకు ఆ పనిలోనే.. చివరకు

Related Articles

Latest Articles