ఆఖరి షెడ్యూల్ లో అడుగుపెట్టిన ఆచార్య!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఆచార్య’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కాజోల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ముఖ్యపాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నాడు. రాంచరణ్ ‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. మే 14 సినిమా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మేకర్స్ కరోనా బారిన పడటం.. ఆ తర్వాత సెకండ్ వేవ్ తాకిడికి వాయిదా పడింది. దాదాపుగా షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా మరో 12 రోజులు షూట్ చేస్తే పూర్తవుతుంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో చిరుతో పాటు రాంచరణ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. దసరాకి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-