జూలైలో “ఆచార్య” షూటింగ్ రీస్టార్ట్

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ క్రేజీ ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తారు. చరణ్ సిద్ధ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ జూలైలో “ఆచార్య” షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని కొరటాల శివ స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే షూటింగ్ కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పరిస్థితి అనుకూలిస్తే జూలై నాటికి తిరిగి షూటింగ్ ప్రారంభించాలని ఆశిస్తున్నట్లు శివ చెప్పారు. కొరటాల రిక్వెస్ట్ మేరకు చిరంజీవి తిరిగి సెట్స్‌కు రావడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ కూడా ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారట. సినిమాకు సంబంధించి 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. షూటింగ్ పూర్తయిన వెంటనే మేకర్స్ ‘ఆచార్య’ విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-