శానా కష్టం నీతో మందాకినీ.. పార్టీ సాంగ్ తో రచ్చ చేస్తున్న ‘ఆచార్య’

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఫిబ్రవరి 4 న విడుదల కానున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ గా శానా కష్టం అనే పార్టీ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో చిరుతో పాటు హీరోయిన్ రెజీనా కాసాండ్రా చిందులు వేసింది. మేకర్స్ చెప్పినట్టుగానే ఏది పార్టీ సాంగ్ లా అనిపిస్తోంది. మణిశర్మ సంగీతం.. మాస్ లిరిక్స్ తో చిరు ఊర మాస్ స్టెప్పులు అదిరిపోయాయి. ఇక రేవంత్, గీత మాధురిల హస్కీ వాయిస్ సాంగ్ ని మరో రేంజ్ లో నిలబెట్టింది.

ఇక రెజీనా ఈ ప్రత్యేక గీతంలో ప్రత్యేకంగా అందాల విందు చేసింది. ఈ సాంగ్ చూస్తుంటే కొరటాల మార్క్ కనిపిస్తోంది. ఇక చిరు డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ గ్రేస్ .. ఆ స్టెప్స్.. ఇప్పటికీ చిరును డాన్స్ లో ఎవరు కొట్టలేరని చెప్పొచ్చు. నేటి నుంచి ప్రతి ఒక్క పార్టీలో ఈ సాంగ్ రచ్చ చేస్తోంది అనడంలో అతిశయోక్తి కాదు. కొణిదల ప్రొడక్షన్స్ ద్వారా రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా .. చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. మరి ఫిబ్రవరిలో ఆచార్య ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

Latest Articles