‘ఆచార్య’ అప్‌డేట్: ‘సిద్ధ సాగా’కు ముహూర్తం సెట్

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఆచార్య ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఏ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా మరో టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సినిమాలో మెగాస్టార్ ఆచార్య గా.. రామ్ చరణ్ సిద్ధగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ‘ఆచార్య’ టీజర్ లో మెగాస్టార్ క్యారెక్టర్ ని చూపించిన మేకర్స్ ఈ టీజర్ సిద్ద క్యారెక్టర్ ని పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. “ధర్మమే సిద్ధ.. నవంబర్ 28 న ‘సిద్ధ సాగా’ని సాక్ష్యంగా చూద్దాం” అంటూ చిరంజీవి ట్విట్టర్ ద్వారా తెలిపారు. అప్ డేట్ తో పాటు ఒక కొత్త పోస్టర్ ని కూడా రివీల్ చేశారు. పోస్టర్ లో చెర్రీ అగ్రెస్సివ్ లుక్ అతడి వెనక బ్యాక్ గ్రౌండ్ లో చిరును చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. చెర్రీ సరసన పూజా హెగ్డే కనిపించనుంది.

Related Articles

Latest Articles