ఓటిటి భాగస్వామిని ఫిక్స్ చేసిన ‘ఆచార్య’

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “ఆచార్య”. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ‘ఆచార్య’ ఇప్పుడు ప్రొడక్షన్ చివరి దశలో ఉన్నాడు. ఈ చిత్రం సామాజిక సంబంధిత కథాంశంతో కూడిన గ్రామీణ యాక్షన్ డ్రామాగా రూపొండుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

Read Also : సామ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… ఫస్ట్ ఇంటర్నేషనల్ మూవీ

ఈ నేపథ్యంలో “ఆచార్య” ఓటిటి భాగస్వామిని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ‘ఆచార్య’ థియేట్రికల్ విడుదలైన కొన్ని వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Related Articles

Latest Articles