‘ఆచార్య’కు దండం పెట్టిన కొరటాల శివ

నాలుగు సంవత్సరాలు ఒకే సినిమాతో ప్రయాణం సాగించాలంటే కష్టమైన పనే. అదీ వరుస హిట్స్ ఇస్తూ ఊపుమీద ఉన్న దర్శకుడికి మరింత కష్టం. కానీ కొరటాలకు తప్పలేదు. 2018లో ‘భరత్ అను నేను’ హిట్ తర్వాత దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా కమిట్ అయి చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది. ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభించడానికి ఎక్కువ టైమ్ తీసుకున్నప్పటికీ వీలయినంత ఫాస్ట్ గా పూర్తి చేశాడు. అయినా కరోనా కారణంగా రిలీజ్ లేట్ అయి ఫిబ్రవరి 2022 లో రాబోతోంది ఈ చిత్రం. నిజానికి కొరటాల శివ ‘ఆచార్య’కు సంబంధించి తన పని మొత్తం పూర్తి చేసి ఫైనల్ కాపీ కూడా సిద్ధం చేశాడు. అయితే ‘ఆచార్య’ విడుదల వాయిదా పడటంతో కొరటాల ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించాడు. శ్రీధర్ సీపానతో పాటు మరి కొందరు రచయితలతో కలసి స్క్రిప్ట్‌ కు మెరుగులు దిద్దుతున్నాడు. ఈ సినిమా షూట్ ను డిసెంబర్ లో మొదలు పెట్టాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ అందుబాటులో లేనందువల్ల జనవరిలో ఇతర తారాగణంతో కొన్ని సీన్స్ తీయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో ‘ఆచార్య’ రిలీజ్ తో పాటు ప్రమోషన్ కోసం గ్యాప్ తీసుకుని, విడుదల కాగానే మళ్ళీ పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ సినిమా షూటింగ్ చేసి ఆ సినిమాను వచ్చే ఏడాది దసరాకి విడుదల చేయాలన్నది ప్లాన్. సో వచ్చే ఏడాది రెండు సినిమాలతో రాబోతున్న కొరటాల తన సక్సెస్ ట్రాక్ ను అలాగే కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Related Articles

Latest Articles