ఆచార్య విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

మెగాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ రాకకు ముహూర్తం ఖరారైంది. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పటికే పలు వార్తలు ప్రచారం లో ఉన్నాయి. ముందుగా దసరాకి వస్తుందని వినిపించినా ఆ తర్వాత వచ్చే సంక్రాంతికి రానుందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. కానీ ఇప్పుడు వాటానికి తెర పడింది. తాజాగా ఈ చిత్రబృందం తాజాగా విడుదల తేదీ ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఈ మధ్యే సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి. దాంతో చాలా సినిమాలు తమ తమ విడుదల తేదీలు ప్రకటించాయి. దాంతో ఈ దసరా. క్రిస్మస్, సంక్రాంతి పండుగలు బుకైపోయాయి. ఇక ఇప్పుడు ఆచార్య కూడా తాను 2022 ఫిబ్రవరి 4న వస్తున్నాను అని చెప్పేసాడు. అయితే కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘ఆచార్య’లో చిరంజీవి టైటిల్ పాత్రలో కనిపించనుండగా రామ్ చరణ్, పూజా హెగ్డే, కాజల్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.

-Advertisement-ఆచార్య విడుదల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

Related Articles

Latest Articles