‘ఆచార్య’ మాస్ మసాలా ట్రైలర్ రెడీ..

చిరంజీవి, రామ్ చరణ్ తో కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై వస్తున్న ‘ఆచార్య’ సినిమా సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘శానా కష్టం…’ పాట యు ట్యూబ్ ని షేక్ చేస్తోంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటను చిరంజీవి, రెజీనాపై చిత్రీకరించారు. ఈ పెప్పీ నెంబర్ మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇదిలా ఉంటే ఆలయాల నేపథ్యంలో దేవాదాయశాఖలో అక్రమాలపై ఈ సినిమా రూపొందుతోంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ రెడీ అయింది. త్వరలోనే దీనిని విడుదల చేయబోతున్నారు. యు.ఎ.ఇ సెన్సార్ బోర్డ్ సభ్యడు ఉమైర్ సంధు ఈ ట్రైలర్ రీవ్యూని ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ట్రైలర్ ఫైనల్ కట్ లాక్ అయిందంటూ చిరంజీవి, రామ్ చరణ్ మళ్ళీ మాస్ మసాలాతో వచ్చారని ట్వీట్ చేశాడు. చిరంజీవి అంటేనే మాస్ మసాలా అని, ట్రైలర్ పూర్తిగా అలాగే ఉంటుందని చెప్పేశాడు ఉమైర్ సంధు. ఈ ‘ఆచార్య’ ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సన్నద్ధం అవుతోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇటు చరణ్‌ కూడా శంకర్ సినిమాతో బిజీ కాబోతున్నాడు. మరి వీరిద్దరి కలయికలో అపజయం ఎరగని కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ‘ఆచార్య’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles