దీపావళి సందడి ‘ఆచార్య’దేనా!?

మెగాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ రాకకు ముహూర్తం ఖరారైందట. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీపై పలు వార్తలు ప్రచారం లో ఉన్నాయి. ముందుగా దసరాకి వస్తుందని వినిపించినా ఆ తర్వాత వచ్చే సంక్రాంతికి రానుందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం వచ్చే ‘దీపావళి’ పండగపై ‘ఆచార్య’ కన్ను పడిందట. దీపావళి కానుకగా నవంబర్ 4 వ తేదీన ‘ఆచార్య’ను విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఇప్పటి వరకూ దీనిని అధికారికంగా ప్రకటించ లేదు. రెండు పాటలు మినహా ‘ఆచార్య’ మొత్తం పూర్తయింది. ఈ రెండు పాటలను కూడా వీలయినంత త్వరగా పూర్తి చేసి దీపావళి విడదలకు సన్నద్ధం అవుతున్నారట. కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘ఆచార్య’లో చిరంజీవి టైటిల్ పాత్రలో కనిపించనుండగా రామ్ చరణ్, పూజా హెగ్డే, కాజల్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-