‘ఆచార్య’ చెర్రీ పోస్టర్ అదుర్స్!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ చివరి షెడ్యూల్ మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసింది. ఇప్పుడు రామ్ చరణ్ నిలువెత్తు ఛాయా చిత్రంతో పోస్టర్ ను విడుదల చేశారు. ‘ది డోర్స్ టు ధర్మస్థలి హావ్ రీఓపెన్డ్’ అంటూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ‘ట్రిపుల్ ఆర్’ మూవీ కోసం విగరస్ గా వర్కౌట్ చేసి చక్కని బాడీని బిల్డప్ చేసిన రామ్ చరణ్ ఈ సినిమాలోనూ అదే ఫిజిక్ తో కనిపిస్తున్నాడు. దాంతో ఈ పోస్టర్ మెగాభిమానులకు కన్నుల పండగగా మారిపోయింది.

Read Also: టీవీ ప్రోగ్రామ్ షూట్ లో యంగ్ టైగర్!

‘ఆచార్య’కు సంబంధించిన ఇప్పటికే విడుదలైన రెండు పాటలూ సూపర్ హిట్ అయ్యాయి. చిరంజీవి, మణిశర్మ ది సూపర్ హిట్ కాంబినేషన్ అని ‘ఆచార్య’ మరోసారి నిరూపించబోతోంది. ఇప్పటికే చిరంజీవితో ‘ఖైదీ నంబర్ 150’లో నాయికగా నటించిన కాజల్ మరోసారి మెగాస్టార్ కు జోడీగా నటించగా, ‘రంగస్థలం’లో రామ్ చరణ్‌ సరసన స్పెషల్ సాంగ్ లో నర్తించిన పూజా హెగ్డే ఈ సినిమా చెర్రీ సరసన నాయికగా నటిస్తుండటం విశేషం. నాన్ స్టాప్ హిట్స్ తో తన కెరీర్ గ్రాఫ్ ను మూవీ మూవీకీ పెంచుకుంటూ వెళుతున్న కొరటాల శివ ‘ఆచార్య’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన్నాడు. రామ్ చరణ్‌ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియచేస్తామంటున్నారు మూవీ మేకర్స్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-