సింగరేణి కేటీకే 5వ గనిలో తప్పిన ప్రమాదం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకే 5వ బొగ్గు గనిలో పెను ప్రమాదం తప్పింది. ఫస్ట్ షిఫ్ట్ లోని 11 డీపీ వద్ద భారీగా చేరింది నీరు. దీంతో నీటిలో మునిగాయి 150 హెచ్ పి మోటార్లు. హుటాహుటిన సంఘటనా స్థలం నుంచి పైకి వచ్చారు కార్మికులు. దీంతో విద్యుద్ఘాతం నుంచి తప్పించుకున్నారు. పెను ప్రమాదం తప్పిందని కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఒక్కో మోటారు రూ.50 లక్షల విలువ చేస్తాయని, సింగరేణికి రూ.1కోటి రూపాయల నష్టం కలిగిందంటున్నారు. ఈ విషయాన్ని బయటకి పొక్కకుండా గోప్యంగా ఉంచారు సింగరేణి అధికారులు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి సింగరేణి విజిలెన్స్ అధికారులతో విచారణ ముమ్మరం చేశారు.

Related Articles

Latest Articles