ఏసీబీ దాడులు…ఐటీడీఏ ఇఇకి భారీ ఆస్తులు

విశాఖ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.వి.ఎస్.ఎన్.కుమార్ పై దాడులు చేశారు ఏసీబీ అధికారులు. ఆయన్ని అరెస్ట్ చేశారు. పాడేరు ఐటీడీఏ లో ఇఇ గా పని చేస్తున్నారు కె.వి.ఎస్.ఎన్.కుమార్. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఫిర్యాదు రావడంతో నిన్న ఎనిమిది చోట్ల సోదాలు చేశారు.

ప్రభుత్వ విలువ ప్రకారం రెండు కోట్ల అరవై లక్షల విలువ చేసే ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. రెండోరోజు తనిఖీల్లో భాగంగా లాకర్ తాళాలు గుర్తించారు అధికారులు. బ్యాంక్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి. సీతమ్మ పేట కో ఆపరేటివ్ బాంక్ లాకర్ లో 40 లక్షల విలువ చేసే అక్రమ ఆస్తుల్ని గుర్తించిన ఏసీబీ కేసు నమోదుచేసింది.

Related Articles

Latest Articles