పంచెకట్టి వేషం మార్చారు.. ఏసీబీ దెబ్బకు హడల్

ఏసీబీ అధికారులంటే టక్ చేసుకుని, హుందాగా ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి అధికారుల భరతం పడతారు. కానీ ఆ అధికారులు మాత్రం రొటీన్ కి భిన్నంగా వ్యవహరించారు. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు. జస్ట్ ఫర్ ఏ ఛేంజ్ అంటూ రైతుల వేషంలో లుంగీలతో మార్కెట్ యార్డులోకి ఎంటరయ్యారు. అక్కడ జరుగుతున్న తంతు అంతా స్కాన్ చేశారు. ఆ తర్వాత రికార్డులు, నగదును పట్టుకోవడంతో వచ్చింది ఎవరనేది వారికి అర్థమయింది.

అనంతపురం మార్కెట్ యార్డులోకి ముగ్గురు వ్యక్తులు లుంగీలతో వచ్చారు. గొర్రెలు, ఎద్దుల కొనేందుకు వచ్చారని అంతా భావించారు. కొందరిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పటికే వచ్చింది రైతులు కాదని అర్థమై కార్యాలయంలో ఇతరులకు తెలిపేలోగా ఏసీబీ అధికారులు తామెవరో చెప్పకనే చెప్పారు. కార్యాలయంలోకి వెళ్ళి రికార్డులు పరిశీలించారు. భారీగా అవకతవకలు బయటపడ్డాయి. మార్కెట్ యార్డులో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగారు. 2లక్షల 20 వేలు నగదు, 12 బిల్ బుక్ లు సీజ్ చేశారు. శని, ఆదివారాల్లో గొర్రెలు, ఎద్దుల్ని అమ్మితే మార్కెట్ యార్డుకి డబ్బులు కట్టాలి. అక్రమాలకు పాల్పడుతూ మార్కెట్ యార్డు ఆదాయానికి గండికొడుతున్నారు. ఏసీబీ దాడుల్లో ఉద్యోగుల నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. సమ్ థింగ్ స్పెషల్ గా జరిగిన ఈ దాడులు హాట్ టాపిక్ అవుతున్నాయి.

Related Articles

Latest Articles