ఏసీబీ చేతికి చిక్కిన జీహెచ్‌ఎంసీ డీఈ..

జీహెచ్‌ఎంసీ డీఈ మహాలక్ష్మి ఏసీబీ చేతికి చిక్కారు. ఈ కేసు పై ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ… మల్లాపూర్ జి హెచ్ ఎం సి స్లీపర్ గా పనిచేస్తున్న రాములు చనిపోవడం తో భార్య సాలెమ్మకు కు ఉద్యోగం వచ్చింది.. ఉద్యోగం ఇప్పించినందుకు 20 వేలు ఇవ్వాలని సాలెమ్మ ను డి ఈ డిమాండ్ చేసింది.. దింతో సాలెమ్మ కొడుకు శ్రీనివాస్ మాకు ఫిర్యాదు చేశాడు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఈ రోజు 20 వేలు ఇస్తుండగా పట్టుకున్నాము. తన అసిస్టెంట్ విజయ్ మల్లాపూర్ లోని యాదగిరి ఫంక్షన్ హాల్ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండగా పట్టుకున్నాము. ప్రస్తుతం డీఈ మహాలక్ష్మి కార్యాలయంలోను నాగారం చక్రిపురి కాలనీ లోని తన నివాసంలో సోదాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు తన నివాసంలో బంగారం, నగదు గుర్తించాము. ఈరోజు సాయంత్రం సోదాలు పూర్తి అయిన తర్వాత అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరుస్తాం అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-