ఏబీవీపీ కార్యకర్తల దాడిపై అనురాగ్ వర్శిటీ ఖండన

కరోనా వ్యాధిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం విధించిన ఆంక్షల మేరకు అనురాగ్ యూనివర్సిటీలో ఎలాంటి ప్రత్యక్ష పాఠాలు బోధన జరపడం లేదు. ఉద్యోగాలు పొందిన కొంతమంది విద్యార్థుల అభ్యర్ధన మేరకు పూర్తి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కొన్ని పాఠ్యాంశాలలో మాత్రమే పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో సుమారు ౩౦ మంది పైన ఏబీవీపీ కార్యకర్తలు దాడికి దిగారు.

యూనివర్శిటీలో ప్రత్యక్ష బోధనను నిర్వహిస్తున్నారని సాకుగా చూపిస్తూ రాజకీయ దురుద్దేశంతో నిన్న యూనివర్సిటీలోకి ఏబీవీపీ కార్యకర్తలు అక్రమంగా, దౌర్జన్యంగా ప్రవేశించారు. ఆయుధాలతో, రాళ్లతో యూనివర్సిటీ ప్రయోగశాలలు, కంప్యూటర్లను, ఫర్నిచర్, సామాగ్రిని, అగ్నిమాపక యంత్రాలను, పూలకుండీలను మరియు కార్యాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న సిబ్బంది మీద భౌతిక దాడికి పాల్పడారు. హత్యా యత్నం చేసి, గాయ పరిచి, బెదిరించి విద్యార్థులను భయాందోళనకు గురిచేశారు. మరల ఇవాళ సిబ్బందికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు, యూనివర్సిటీ పట్ల అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు, పోలీసులను కోరుతున్నామని అనురాగ్ యూనివర్సిటీ స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు.

Related Articles

Latest Articles