వ్యవసాయ చట్టాల రద్దు కాంగ్రెస్‌ విజయం: భట్టి విక్రమార్క

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించు కుంటున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించడం కాంగ్రెస్‌ పార్టీ విజయమే నని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభివర్ణించారు. కాంగ్రెస్‌ మొదటి నుంచి చెబుతూనే వస్తుందని, ఆరైతు చట్టాల్లో రైతు ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశాలు ఉన్నాయని, ఆ చట్టాల రూపకల్పన, అమలు విషయలో కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అని అన్నారు. ఈ విషయమై ఏఐసీసీ నాయకుడు రాహుల్‌ గాంధీ దేశ రైతాంగాన్ని అప్రమత్తం చేయడమే కాకుండా వారు చేపట్టిన ఆందోళ నకు మద్దతు పలికారని తెలిపారు. రైతులు చేపట్టిన పలు ఆందోళన కార్యక్రమాలకు సైతం సంఘీభావంగా కాంగ్రెస్‌ పార్టీ వారికి అండగా నిలించిందన్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆ వ్యవసాయ చట్టాల విషయంలో వెనకకు తగ్గడాన్ని రైతులు, కాంగ్రెస్‌ పార్టీ విజయంగా ఆయన భట్టి తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా వ్యతిరేక,రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసే పరిపాలనా విధానాల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ రాజీ పడకుండా పోరాడుతుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఇక రాష్ర్టంలో కేసీఆర్‌ రైతు లను మోసం చేస్తున్నారని ధాన్యం కొనుగోలుపై రాష్ర్టప్రభుత్వ వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్రం నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు.

Related Articles

Latest Articles