ఆకట్టుకుంటున్న అభిషేక్ ‘బాబ్ బిస్వాస్’ ట్రైలర్…

2000లో ‘రెఫ్యూజీ’తో ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం నటుడుగా పేరు తెచ్చే సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ‘మన్ మర్జియాన్’, ‘లూడో’, ‘ద బిగ్ బుల్’ వంటి సినిమాలలో పాత్రలతో ఆకట్టుకున్న అభిషేక్ ఇప్పుడు ‘బాబ్ బిస్వాస్’ పేరుతో ఆసక్తికరమైన మూవీ చేస్తున్నాడు. షారూఖ్ ‘రెడ్ చిల్లీస్’ బ్యానర్ దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ బాబ్ బిస్వాస్ 2012లో విడుదలైన ‘కహానీ’ సినిమాలో పాత్ర. నిజానికి కహానిలో ఆ పాత్రను శావ్వత ఛటర్జీ పోషించారు. సుజయ్ ఘోష్‌ ఆ చిత్రానికి దర్శకుడు. అతడు ఆ పాత్రపై స్విన్ ఆఫ్ ఫిల్మ్ తీయాలనుకున్నాడు.

అయితే ఇప్పుడు అతని కూతురు దియా దర్శకత్వంలో ‘బాబ్ బిస్వాస్’ రూపొందింది. కథను మాత్రం సుజయ్ ఘోష్ అందించారు. ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ జీ5లో డిసెంబర్ 3న స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, అందులో అభిషేక్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. బాబ్ నేపథ్యం, అతను కాంట్రాక్ట్ కిల్లర్ గా మారటానికి దారితీసిన పరిస్థితులను ఇందులో చూడబోతున్నట్లు ట్రైలర్ చూడగానే అర్థం అవుతుంది. చిత్రాంగద సింగ్, రోనిత్ ఆరోరా, పరాన బందోపాధ్యాయ, టినా దేశాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు క్లింటన్ సెరిజో, బియాన్స్ గోమ్స్ సంగీతం అందించారు. గౌరీఖాన్, సుజయ్ ఘోష్‌, గౌరవ్ వర్మ నిర్మాతలు.

Related Articles

Latest Articles