గుజ‌రాత్‌లో మ‌నుగ‌డ కోసం సామాన్యుడి ప‌ట్టు…

గుజ‌రాత్ రాజ‌కీయాల్లో అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  వ‌చ్చే ఏడాదిలో జ‌రిగే ఎన్నిక‌లే ప్ర‌ధాన ల‌క్ష్యంగా చేసుకొని బీజేపీ ఎత్తులు వేస్తున్న‌ది.  ఇక కాంగ్రెస్ పార్టీ ప‌టేల్ వ‌ర్గాన్ని ద‌గ్గ‌ర చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న స‌మ‌యంలో ఆప్ కూడా త‌న మ‌నుగడ చాటుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.  గుజ‌రాత్‌లో పారిశ్రామిక న‌గ‌ర‌మైన సూర‌త్‌లో ఆ పార్టీ బలంగా ఉన్న‌ది.  ఇటీవ‌ల జ‌రిగిన మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో 20 వార్డులు గెలుచుకొని త‌న ఉనికిని చాటుకుంది.  గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని నియోజ‌క వ‌ర్గాల నుంచి పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది ఆప్‌.  ఉచిత విద్యుత్ అంశాన్ని గుజ‌రాత్‌లో కూడా అమ‌లు చేస్తామ‌ని ఆప్ ప్ర‌క‌టించింది.  బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు బ‌లంగా పాతుకుపోయిన గుజ‌రాత్‌లో ఆప్ ఎదుర్కొని నిల‌బ‌డ‌టం కొంత క‌ష్ట‌మే అయిన‌ప్ప‌టికీ, ప‌ట్టున్న కొన్ని చోట్లైనా విజ‌యం సాధించ‌గలిగితే అది ఆ పార్టీకి క‌లిసివ‌చ్చే అంశంగా మారుతుంద‌న‌డంలో సందేహం అవ‌స‌రం లేదు.

Read: హైద‌రాబాద్‌లోని గ‌ణేష్ మండ‌పాల‌కు పోలీసుల నోటీసులు… ఎందుకంటే…

Related Articles

Latest Articles

-Advertisement-