షాలినీ పాండేతో కలసి మళ్లీ సెట్స్ మీదకి ఆమీర్ తనయుడు… ‘మహారాజా’ రిటర్న్స్!

ఆమీర్ ఖాన్ మొదటి భార్య కొడుకు జునైద్ ఖాన్. త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అయితే, 2021 ప్రారంభంలో ఆయన మొదటి చిత్రం ‘మహారాజ’ మొదలైంది. కానీ, లాక్ డౌన్ వల్ల అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే, మహరాష్ట్ర ప్రభుత్వం విడతల వారిగా ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో ‘మహారాజ’ సినిమా నిర్మాత ఆదిత్య చోప్రా షూటింగ్ రీస్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ముంబైలోని మరోల్ ప్రాంతంలో వేసిన సెట్స్ లో చిత్రీకరణ పునః ప్రారంభం కానుంది. జూనైద్ ఖాన్ తో పాటూ ‘మహారాజ’ సినిమాలో ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే కూడా నటిస్తోంది. అన్ని రకాల కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు తీసుకుంటూనే ‘మహారాజా’ షూటింగ్ కొనసాగించనున్నారు. బాలీవుడ్ లో సెకండ్ వేవ్ లాక్ డౌన్ తరువాత కెమెరా ముందుకు వెళుతోన్న తొలి చిత్రం ‘మహారాజా’నే కావటం విశేషం!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-