సౌత్ స్టార్ తో క్లాష్… ‘లాల్ సింగ్ చద్దా’ వెనకడుగు !

మహారాష్ట్రలో సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభమైన తర్వాత పెద్ద స్టార్స్ అందరూ తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించారు. వారిలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఒకరు. ఆయన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ 2022 ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. కానీ ఇప్పుడు ఈ చిత్రం విడుదల తేదీని వాయిదా వేశారు. కొన్ని కారణాల వల్ల అమీర్ ఖాన్ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో ఆయన పాత్ర బాల్యం నుండి వృద్ధాప్యం వరకు కథను వర్ణిస్తుంది. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌ని భారీ స్థాయిలో ఉపయోగిస్తున్నారు. ఈ పనికి ఎంత సమయం పడుతుందని అనుకున్నారో దానికన్నా సమయం తీసుకుంటోంది వీఎఫ్‌ఎక్స్‌ వర్క్. అందుకే ‘లాల్ సింగ్ చద్దా’ను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయాలనీ భావిస్తున్నారట మేకర్స్. అప్పటికి ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులన్నీ పూర్తవుతాయి.

Read Also : హీరో సూర్యకు భద్రత… ఇంటి వద్ద హై సెక్యూరిటీ

కానీ ఈ అదే రోజు సినిమా విడుదలైతే సౌత్‌లోని బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటైన ‘కేజీఎఫ్ 2’ను అమీర్ ఢీ కొట్టడం ఖాయం. అందుకే ‘లాల్ సింగ్ చద్దా’ వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలు చాలా బిజీగా ఉండబోతున్నాయి ఏప్రిల్ లోనే సినిమాకు సరైన రిలీజ్ డేట్ వెతుక్కోవాలంటే కష్టమే. ఏప్రిల్ 14 కాకుండా ఈద్ సందర్భంగా సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అంటే ఏప్రిల్ 28న విడుదల కావొచ్చు. అయితే అదే సమయంలో సాజిద్ నడియావాలా ‘హీరోపంతి 2’, అజయ్ దేవగన్ ‘మే డే’ విడుదల కానున్నాయి. విడుదల తేదీని ఖరారు చేసే ముందు అమీర్ ఈ ఇద్దరు స్నేహితులతో మాట్లాడవచ్చు. ఇక సినిమా విడుదల తేదీ వాయిదా పడడం మాత్రం ఖాయం త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు.

అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’కి ఇది అధికారిక రీమేక్‌. ఈ చిత్రంలో కరీనా కపూర్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో దక్షిణాది నటుడి పేరు చైతన్య బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు.

Related Articles

Latest Articles