ఆకట్టుకున్న ‘ఆకాశవాణి’ ట్రైలర్

కొత్త ఆర్టిస్టులతో రూపొందుతున్న చిత్రం ‘ఆకాశవాణి.. అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తుండగా.. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 24 నుంచి సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. అడవి ప్రాంతంలోని గిరిజన గూడెం చుట్టూ అల్లుకోబడిన కథ అనే విషయం ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. ఆ గూడెం ప్రజలకు ఓ వ్యక్తి రేడియోను అందుబాటులోకి తీసుకొస్తాడు. ఆ రేడియో వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేదే కథాంశంగా తెలుస్తోంది. కాలభైరవ సంగీతాన్ని అందించగా, సముద్రఖని, వినయ్ వర్మ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు.

-Advertisement-ఆకట్టుకున్న ‘ఆకాశవాణి’ ట్రైలర్

Related Articles

Latest Articles