స్టార్ కిడ్స్ సితార, ఆద్య మరో ముందడుగు!

ప్రిన్స్ మహేశ్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ‘మహర్షి’ సినిమాతో ఎంతో చేరువైపోయారు. జాతీయ స్థాయిలో బెస్ట్ పాపులర్ ఫిల్మ్ గా ‘మహర్షి’ నిలువడం వెనుక కూడా వారిద్దరి మధ్య ఏర్పడిన బాండింగ్ ఓ కారణం. విశేషం ఏమంటే… కేవలం మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి మధ్యే కాదు… వారి కుటుంబ మధ్య కూడా అనుబంధం ఏర్పడింది. అలా మహేశ్ కుమార్తె సితార, వంశీ కూతురు ఆద్య కలిసి ఓ యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తున్నారు. తమ అభిమాన విషయాలను, అభిరుచులను దాని ద్వారా వీక్షకులకు తెలియచేస్తున్నారు, తమ మనసులో మాటలను పంచుకుంటున్నారు. ఇప్పటికే వారి ఛానెల్ కు 2.5 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇక సితార సొంతంగా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను మెయిన్ టైన్ చేస్తోంది. దానికి 3.9 లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా సితార, ఆద్య అంతర్జాతీయ ఖ్యాతి పొందిన సెసేమ్ వర్క్ షాప్ తో చేతులు కలిపారు. ఇండియాలోనే తొలిసారి వీరు తెలుగు యూట్యూబ్ ఛానెల్ లో ఒరిజినల్ ఫన్ సీరియస్ కు శ్రీకారం చుట్టారు. అమెరికన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అయిన సెసేమ్ వర్క్ షాప్ లో ‘ఎల్మో, చమ్కీ, కుక్కీ మన్ స్టార్ లాంటి ముప్పెట్ క్యారెక్టర్స్ ఉంటాయి. విద్యార్థులలో విజ్ఞానాన్ని పెంచే పలు కార్యక్రమాలను వీటి ద్వారా ప్రపంచానికి ఈ సంస్థ అందిస్తుంటుంది. వారి మంచి ఆలోచనలకు ఫిదా అయిన మహేశ్, వంశీ…. తమ పిల్లలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. తాజాగా ఎల్మోతో జరిగిన ‘టాకింగ్ అబౌట్ టాకింగ్’ అనే కార్యక్రమంలో సితార, ఆద్య పాల్గొని, వీక్షకులకు వినోదాన్ని పంచారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-