‘కిరాతక’ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్

ఆది సాయికుమార్, పాయ‌ల్‌ రాజ్ పుత్ హీరో హీరోయిన్లుగా ఎం. వీర‌భ‌ద్రమ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం కిరాత‌క‌. విజ‌న్ సినిమాస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన కిరాత‌క టైటిల్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజు కిరాతక ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌కి ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌స్తోంది. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో రూపొందుతోన్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఆగస్ట్ 13నుండి ప్రారంభంకానుంది.

ఈ సంద‌ర్భంగా హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ – ”నేను ఇప్ప‌టివ‌ర‌కు చాలా క‌థ‌లు విన్నాను..కాని ఈ థ్రిల్ల‌ర్ క‌థ‌ నాకు బాగా న‌చ్చింది.పెర్‌ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్‌. అలాగే ఆదితో ఫ‌స్ట్ టైమ్ న‌టిస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది” అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భ‌ద్ర‌మ్ మాట్లాడుతూ – ‘ప్ర‌స్తుతం ఆర్టిస్టుల ఎంపిక జ‌రుగుతోంది. ఈ చిత్రంలో పూర్ణ ఒక ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే దాస‌రి అరుణ్ కుమార్, దేవ్‌గిల్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఆది ఇంత వ‌ర‌కూ చూడ‌ని ఒక స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. కిరాత‌క క‌థ న‌చ్చి సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ సినిమాలో న‌టించ‌డానికి పాయ‌ల్ రాజ్‌పుత్ ఒప్పుకుంది. ఆమె క్యారెక్ట‌ర్ కూడా ఆడియ‌న్స్‌ని థ్రిల్ చేస్తుంది. భారీ బ‌డ్జెట్‌తో విజన్ సినిమాస్ బ్యాన‌ర్‌లో నాగం తిరుప‌తి రెడ్డిగారు అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు’ అన్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఆది సాయికుమార్, ఎం. వీరభద్రం కాంబినేషన్ లో ‘చుట్టాలబ్బాయి’ తర్వాత వస్తున్న రెండో సినిమా ‘కిరాతక’!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-