క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కు ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కు ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ లో తొలి చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా అక్టోబర్ 15న రామానాయుడు స్డూడియోస్ లో ఉదయం 9:45 కి ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. దర్శకుడు శివశంకర్ దేవ్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. శ్రీమతి సునీత సమర్పణలో, అజయ్ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్టర్ ను బట్టి ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనిపిస్తోంది. సూట్ వేసుకున్న హీరో చేతిలో పిస్టల్ తో టార్గెట్ ఎయిమ్ చేశారు. మరి ఆ టార్గెట్ ఏంటో, ఎందుకో తెలియాలంటే సినిమాలో చూడాలి. ‘ఈ సినిమా ఆది సాయి కుమార్ కు కొత్త ఇమేజ్ ని తెస్తుందని, ఆయన చేస్తున్న మరో డిఫరెంట్ అటెంప్ట్ గా ఈ సినిమాను చెప్పుకోవచ్చని నిర్మాత చెబుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనీష్ సొలమన్, సినిమాటోగ్రఫీ : గంగనమోని శేఖర్.

-Advertisement-క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కు ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్

Related Articles

Latest Articles