ఆది సాయికుమార్ హీరోగా ఎం. వీర‌భ‌ద్రం ద‌ర్శ‌క‌త్వంలో సినిమా!

‘ప్రేమ‌కావాలి’, ‘ల‌వ్‌లీ’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల హీరో ఆది సాయికుమార్‌, ‘అహ‌ నా పెళ్ళంట‌!’‌, ‘పూలరంగడు’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎం. వీర‌భ‌ద్రం. వీళ్లిద్ద‌రి కాంబినేష‌న్‌లో గతంలో ‘చుట్టాలబ్బాయి’ చిత్రం వచ్చింది. మళ్ళీ ఇప్పుడీ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఆది సాయికుమార్ హీరోగా, ఎం. వీర‌భ‌ద్రం ద‌ర్శ‌క‌త్వంలో విజ‌న్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ ప‌తాకాల‌పై నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాత‌లుగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అన్ని వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఎం. వీర‌భ‌ద్రం మాట్లాడుతూ – ఆది సాయికుమార్ హీరోగా చిత్రం చేయబోతున్నాను. స‌బ్జెక్ట్ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా మ‌రో మంచి హిట్ సినిమా అవుతుంది. నాగం తిరుప‌తి రెడ్డి, పి. మన్మథరావు మంచి అభిరుచి ఉన్న నిర్మాత‌లు. ఒక సూప‌ర్‌హిట్ సినిమా చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. వారి నిర్మాణంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఒక భారీ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువ‌స్తాం అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-