రామ్ ను ఢీ కొట్టబోతున్న ఆది పినిశెట్టి!

రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా లింగుస్వామి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్పాట్ కు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ వచ్చి అందరినీ ఆశ్చర్యపర్చడంతో పాటు అభినందించి వెళ్ళారు. హైదరాబాద్, వైజాగ్ లో ఈ సినిమా షెడ్యూల్స్ ను ప్లాన్ చేశారు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ అధినేత శ్రీనివాస్ చిట్టూరి. చిత్రం ఏమంటే… రామ్ తో ఈ మూవీలో ఎవరు ఢీ కొట్టబోతున్నారనే విషయంలో ఇంతవరకూ క్లారిటీ రాలేదు. ఇందులో విలన్ పాత్రను దర్శకుడు లింగుస్వామి చాలా డిఫరెంట్ గా, పవర్ ఫుల్ గా రాసుకున్నాడని తెలుస్తోంది. అందుకోసం ఓ సాలీడ్ విలన్ కోసం ఆయన చూస్తున్నారట. ఆ మధ్య వరకూ ఇందులో మాధవన్ విలన్ గా నటిస్తాడనే ప్రచారం జరిగింది. కానీ దాన్ని ఆయన స్వయంగా ఖండించాడు. ఆ తర్వాత ఆర్య పేరు వెలుగులోకి వచ్చింది.

బట్ తాజా సమాచారం ఏమంటే… ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ లో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషించబోతున్నాడట. ప్రస్తుతం హీరోగా మూడు నాలుగు సినిమాల్లో చేస్తున్న ఆది…. డెప్త్ ఉండాలే కానీ ప్రతినాయకుడి పాత్ర చేయడానికీ వెనుకాడడు. అందుకు ‘సరైనోడు’ మూవీలో అతను పోషించిన వైరం ధనుష్ పాత్రే ఓ ఉదాహరణ. అంతేకాదు… ఈ సినిమా నిర్మాత శ్రీనివాస్ చిట్టూరితోనూ ఆది పినిశెట్టికి చక్కని అనుబంధం ఉంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో వచ్చిన తొలి చిత్రం ‘యూ టర్న్’లో ఆది ఎస్.ఐ. నాయక్ పాత్రను పోషించాడు. అందుకే ఈ బైలింగ్వల్ మూవీలో ఆదిని విలన్ క్యారెక్టర్ కు ఖరారు చేసినట్టు సమాచారం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-