మందు బాబులకు షాక్.. ఆధార్‌, వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే మద్యం..!

మందు బాబులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది తమిళనాడు ప్రభుత్వం.. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ఆధార్‌ కార్డు, కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నట్టు సర్టిఫికెట్‌ ఉంటేనే మద్యం విక్రయించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఇది ప్రస్తుతానికి నీలగిరి జిల్లాలో అమలు చేస్తున్నారు. మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్‌ కార్డు, కరోనా టీకా వేయించుకున్న సర్టిఫికెట్‌ చూపించాల్సిందేనని స్పష్టం చేశారు అధికారులు… కాగా, నీలగిరి జిల్లాలో 76 మద్యం దుకాణాలుండగా రోజూ రూ.కోటి విలువైన మద్యం విక్రయాలు జరుగుతుంటాయి.. ఇక, ఆ ప్రాంతంలో 18 ఏళ్లకు పైబడినవారు 5.82 లక్షల మంది ఉండగా.. ఇప్పటికే 70 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు. కరోనా నివారణ చర్యలతో పాటు.. మిగతా వారు వ్యాక్సినేషన్‌ వేయించుకోవడానికి మొగ్గుచూపేలా ప్రభుత్వ నిర్ణయం ఉందంటున్నారు విశ్లేషకులు.. ప్రస్తుతానికి నీలగిరి జిల్లాకే పరిమితమైన ఈ రూల్‌ను క్రమంగా ఇతర ప్రాంతాలకు విస్తరించే ఆలోచనలో స్టాలిన్‌ సర్కార్‌ ఉందని సమాచారం.

Related Articles

Latest Articles

-Advertisement-