హరీష్ శంకర్ మూవీకి పవన్ షాకింగ్ రెమ్యూనరేషన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న స్టార్స్ లో ఒకరు. మరి రెమ్యూనరేషన్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది కదా ! అందుకే టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో పవర్ స్టార్ ముందు వరుసలో ఉంటారు. ఈ నేపథ్యంలో పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ? అనే విషయంపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది.

Read Also : అవాంతరాలను దాటేసిన “ఆర్సీ 15″… టైటిల్ ఇదే?

గతంలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన కోర్టు డ్రామా “వకీల్ సాబ్”కు పవన్ కళ్యాణ్ రూ.50 కోట్లు వసూలు చేశారని గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో గట్టిగా ప్రచారం జరిగింది. హిందీ మూవీ “పింక్” రీమేక్ గా రూపొందిన ఈ సోషల్ డ్రామా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రస్తుతం పవన్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేశారట. తాజా బజ్ ప్రకారం పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్ట్ “పిఎస్పికే28″కు షాకింగ్ రెమ్యూనరేషన్ ను అందుకున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం పవన్ కు ఏకంగా 60 కోట్లు పారితోషికంగా పుచ్చుకున్నారట. ఈ మేరకు పవన్ భారీగా రెమ్యూనరేషన్ పెంచారనే ప్రచారం టాలీవుడ్ లో జోరందుకుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారు పవన్.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “భీమ్లా నాయక్”, “హరి హర వీర మల్లు” ప్రాజెక్ట్స్ షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవలే దర్శకుడు హరీష్ శంకర్ నిర్మాతలతో కలిసి పవన్ కళ్యాణ్‌ని కలుసుకుని ప్రాజెక్ట్ గురించి చర్చించారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పూజా హెగ్డే స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని 2022 ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-