ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ట్విస్ట్‌ !

ముంబై క్రూయిజ్‌షిప్‌ కేసులో ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరుపుతోంది న్యాయస్థానం. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్‌కు బెయిల్‌ నిరాకరించింది న్యాయస్థానం. దీంతో నాలుగోసారి బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు ఆర్యన్‌ తరపు న్యాయవాది. అయితే, ఈ కేసులో ఎన్‌సీబీ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకించింది ఎన్‌సీబీ.

ఈ కేసులో అరెస్టైన మిగతావారిలాగే ఆర్యన్‌ఖాన్‌కు కూడా సంబంధం ఉందని వాదనలు వినిపించింది. ఆర్యన్‌ఖాన్‌ను, మిగతావారిని వేరు చేసి చూడలేమని చెప్పింది ఎన్‌సీబీ. ఇప్పటివరకు క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్స్‌ కేసులో 20మందిని అరెస్ట్‌ చేశారు ఎన్‌సీబీ అధికారులు. గతవారం ఆర్యన్‌ ఖాన్‌కు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది కోర్టు. అక్టోబర్‌ 8న దాఖలు చేసిన ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పుడు మరోసారి బెయిల్‌పై విచారణ జరుపుతున్న న్యాయస్థానం.. ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

-Advertisement-ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ట్విస్ట్‌ !

Related Articles

Latest Articles