నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో చెలరేగిన మంటలు

హైదరాబాద్ న‌గ‌రంలోని అత్తాపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పీవీ న‌ర‌సింహారావు ఎక్స్‌ప్రెస్ వే 202 పిల్ల‌ర్ వ‌ద్ద నడుస్తున్న బీఎండ‌బ్ల్యూ కారులో ఆక‌స్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భ‌య‌ప‌డ్డ స్థానికులు దూరంగా ప‌రుగెత్తారు. కారు ఇంజిన్ భాగంలో పొగలతో కూడిన మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ పక్కకు నిలిపివేశాడు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు త్వరగా దిగేయడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పక్కనే వున్నా పెట్రోల్ బంక్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సహాయంతో మంటలను ఆర్పివేశారు. కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-