పార్ల‌మెంటులో ఎలుక‌…ప‌రుగులు తీసిన నేత‌లు…

పార్ల‌మెంట్‌లో దేశంలోని స‌మ‌స్య‌ల గురించి నేత‌లు సీరియ‌స్‌గా చర్చ చేస్తున్నారు.  చ‌ర్చిస్తున్న స‌మ‌స్య‌ల‌పై స్పీక‌ర్ మాట్ల‌డుతున్న స‌మ‌యంలో అనుకోకుండా ఓ అతిధి స‌భ‌లోకి ప్ర‌వేశంచింది.  దానిని చూసి స్పీక‌ర్ షాక్ కావ‌డ‌మే కాకుండా గట్టిగా నోటిని మూసేకున్నారు.  అంత‌లో స‌భ‌లో క‌ల‌క‌లం రేగింది.  నేతులు అటూ ఇటూ ప‌రుగులు తీశారు.  వీరిని అంతలా ప‌రుగులు పెట్టించిన అతిధి ఎదో కాదు… చిన్న ఎలుక‌.  ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో ఎలా వ‌చ్చిందో తెలియ‌దు.  పార్ల‌మెంట్ భ‌వ‌నంలోకి వ‌చ్చేసింది.  

Read: మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న విశ్వ క్రీడలు…

ఆ ఎలుక‌ను చూసి స‌భ‌లోని వారంతా ప‌రుగులు తీశారు.  ఎవ‌రి సీటు కింద‌కు వ‌స్తుందో ఎవ‌ర్ని కొరుకుతుందో అని భ‌య‌ప‌డ్డారు.  భ‌ద్ర‌తాసిబ్బంది వ‌చ్చి ఎలుక‌ను ప‌ట్టుకొని వెళ్లిన త‌రువాత అంతా ఊపిరి పీల్చుకున్నారు.  దీనికి సంబందించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  స్పెయిన్‌లోని అండ‌లూసియా పార్ల‌మెంట్ స‌మావేశాల స‌మ‌యంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. 

-Advertisement-పార్ల‌మెంటులో ఎలుక‌...ప‌రుగులు తీసిన నేత‌లు...

Related Articles

Latest Articles