కాంట్రాక్టుల పేరుతో కోటి పై చిలుకు నొక్కేసిన కేటుగాడు

మోసగాళ్లు రోజురోజుకు మితిమీరి పోతున్నారు. కొత్త కొత్త పంథాలతో అమాయకులను టార్గెట్‌ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. కాంట్రాక్ట్‌ ఇప్పిస్తానంటూ ఓ కేటుగాడి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్‌కు చెందిన జేసీబీ, ట్రాక్టర్ల యాజమానులకు ప్రభుత్వం కాంట్రాక్ట్‌లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నమ్మబలికాడు. దీంతో సదరు వ్యక్తి మాటలు నమ్మిన జేసీబీ, ట్రాక్టర్ల యాజమానులు ముడుపులు ముట్టజెప్పారు. ఇంకేముంది.. ఆ ముడుపులు తీసుకు ఆ కేటుగాడు పరారయ్యాడు.

దీంతో మోసపోయామని తెలిసిన జేసీబీ, ట్రాక్టర్ల యజమానులు మహబూబాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో కేటుగాడు 100 మందిని ఇలాగే మోసం చేసినట్లు తెలియడంతో పోలీసులు ఖంగుతిన్నారు. అంతేకాకుండా బాధితుల దగ్గర వసూలు చేసిన కోటి 80 లక్షలతో ఊడాయించినట్లు తెలిసింది. నిందితుడు అనంతపురం జిల్లాకు చెందిన నాగేంద్రగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నాగేంద్ర కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Related Articles

Latest Articles