దారుణం.. భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి.. ఇద్దరు పిల్లలను దిండుతో నొక్కి

ఎంతో చక్కని ఫ్యామిలీ.. ప్రేమించే భార్య.. రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు.. సాఫీగా సాగిపోతున్న జీవితం.. ఒక మధ్య తరగతి వ్యక్తికి ఇంతకన్నా ఆనందం ఉండదు. అయితే అంతలోనే అనుకోని సమస్య.. ఒక్కసారిగా అతని జీవితం కుదేలు అయిపొయింది. ఉద్యోగం పోయింది.. ఇతని ఖర్చుల కోసం అప్పు చేయాల్సి వచ్చింది. చివరికి ఆ అప్ప్పు తీర్చలేక అతను దారుణ నిర్ణయం తీసుకున్నాడు. కట్టుకున్న భార్యను, కన్నా బిడ్డలను హతమార్చి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన చెన్నైలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని పెరుంగుడిలోని అపార్ట్‌మెంట్‌లో మణిగండన్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతనికి భార్య ప్రియ (36).. ధరన్‌(10), దహన్‌(01) అనే కుమారులు ఉన్నారు. మణిగండన్ ఒక సాప్ట్ వేర్ ఉద్యోగి.. మంచి జీతం.. మంచి జీవితం .. ఐటీ రెండేళ్ల క్రితం అతని ఉద్యోగం పోయింది. దీంతో ఇంటి భారం మొత్తం అతడిపై పడింది. ఇల్లు గడవడానికి స్నేహితుల దగ్గర, ప్రైవేట్ బ్యాంకుల వద్ద దాదాపు 80 లక్షలు అప్పు చేశాడు. తీరా ఆ అప్పును ఎలా తీర్చాలో తెలియని పరిస్థితి.. అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వచ్చి గొడవపడుతుండడంతో డబ్బులు కట్టే అవకాశం లేక దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఈ సమస్యకు చావే పరిష్కారమని అలోచించి భార్యను క్రికెట్ బ్యాట్ తో కొట్టి. పిల్లలను దిండుతో నొక్కి చంపాడు. అనంతరం తానూ వంటగదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. ఆదివారం వీరి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Related Articles

Latest Articles