తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి

తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 10 మంది మంటల్లో చిక్కుకోగా ఐదుగురు సజీవ దహనం అయ్యారు. కాగా పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తమిళనాడులోని కల్వాకుర్చి జిల్లా శంకరాపురంలోని బాణాసంచా గోడౌన్ లో పేలుడు సంభవించింది. మరో 10 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ప్రమాదం పై సమాచారం రాగానే ఫైర్‌ సిబ్బంది రెస్క్యూటీం.. సహాయ చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

కాగా, భారీ మంటలు ఎగిసిపడుతుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు 25 మందికి పైగా షాపు లోపల ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ పీఎన్ శ్రీధర్ ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారని అధికారికంగా తెలిపారు. ప్రమాదంలో మరో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.

Related Articles

Latest Articles