సోమాలియాలో భారీ పేలుడు

సోమాలియా రాజధాని మొగదిషులో ఐరాస భద్రతా సిబ్బంది కాన్వారులో భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఎనిమిది మంది మరణించగా, 17 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో 13 మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా సిబ్బంది లక్ష్యంగా గురువారం తెల్లవారుజామున ఎస్‌యువి వాహనం నిండా పేలుడు పదార్థాలతో సూసైడ్‌ బాంబర్‌ దాడి జరిపినట్లు పోలీసుల ప్రతినిధి అబ్దిఫత్‌ అడెన్‌ హసన్‌ తెలిపారు. మొగదిషులోని కె4 జంక్షన్‌ సమీపంలో పేలుడు జరిగిందని, అనంతరం కాల్పులు కూడా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కె4 జంక్షన్‌ సమీపంలోనే ముకస్సర్‌ ప్రాథమిక, సెకండరీ పాఠశాల, ఆస్పత్రి ఉన్నాయని అన్నారు. పేలుడు దాటికి పాఠశాల, ఆస్పత్రి కూలిపోయాయని, వివరాలు తెలియదని అన్నారు. అలాగే ఈ దాడిలో ఐక్యరాజ్యసమితి సిబ్బందిలో ఎంత మంది మరణించారు, ఎంత మంది గాయపడ్డారు… అనే అంశంపై స్పష్టత లేదని, స్పందించేందుకు యుఎన్‌ అధికారులు నిరాకరించారని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ పేలుడు ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు అల్‌-షబాబ్‌ ప్రకటించింది.

Related Articles

Latest Articles