తెలంగాణలో దారుణం : మూడేళ్ల చిన్నారిని చితకబాదిన తండ్రి..వీడియో వైరల్ !

ప్రస్తుత జనరేషన్‌ లో పిల్లల పట్ల తల్లిదండ్రులు అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు. తమ దారి తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు పేరెంట్స్‌. ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల మరీ క్రూరంగా వ్యవహరిస్తున్నారు కొంత మంది తల్లిదండ్రులు. ఇటీవలే… తమిళనాడులో ఓ చిన్నారి పట్ల క్రూరంగా వ్యవహరించింది ఓ తల్లి. ఆ ఘటన మరువక ముందే… అలాంటి ఘటనే తెలంగాణలోనూ చోటు చేసుకుంది. ఓ మూడు సంవత్సరాల చిన్నారి పట్ల.. సొంత తండ్రి దారుణంగా వ్యవహరించాడు. మాట వినడం లేదంటూ.. తాడుతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటన తెలంగాణ లోని మెదక్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… మెదక్‌ జిల్లాకు చెందిన మేడిశెట్టి నాగరాజు కు 3 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ చిన్నారి ఉంది. అయితే.. అన్నం తినడం లేదని… ఆ చిన్నారిని దారుణంగా కొట్టాడు ఆ తండ్రి. తాడుతో చిన్నారి మోఖం, వీపు భాగాల్లో… గొడ్డును బాదినట్టు బాదాడు. అలాగే… ఆ చిన్నారి మెడ పట్టుకుని… పైకి లేపి మరీ కొట్టాడు ఆ కిరాతకుడు. చిన్నారి ని కొట్టడం చూసి… తల్లి కూడా నవ్వుతూ ఎంజాయ్‌ చేయడం కొసమెరుపు. అయితే.. ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి… ఎవరికీ తెలియకుండా ఈ వీడియో ను తీశాడు. తీసిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో బయటపడింది.

Related Articles

Latest Articles