నటి కంగనా రనౌత్‌పై కేసు నమోదు


కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్‌ పై కేసు నమోదయింది. ఇప్పటికే తన నోటి దురుసుతో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఈ భామ తాజాగా మరో కేసులో ఇరుక్కుంది. గతంలో స్వాతంత్ర్యం 1947లో రాలేదు. అప్పుడు వచ్చింది కేవలం భిక్ష మాత్రమేనని 2014లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం అంటూ కామెంట్లు చేయడంతో దేశ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది.దేశ వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలతో తీవ్ర స్థాయిలో దుమారం చేలరేగింది.తను తీసుకున్న పద్మశ్రీ అవార్డును సైతం వెనక్కు ఇచ్చివేయాలనే డిమాండ్‌ క్రమ క్రమంగా పెరిగింది. అంతటితో ఆగకుండా పద్మశ్రీ అవార్డును వెనక్కు ఇవ్వనని ఈ అమ్మడు తెగేసి చెప్పింది.

తాజాగా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో..రైతుల ఉద్యమాన్ని ఖలిస్తాని ఉద్యమంగా అభివర్ణిస్తూ ఇన్‌స్ర్టాగ్రామ్‌లో కంగనా పలు అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో కంగనా వ్యాఖ్యలపై సిక్కుల మనో భావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆ సంఘం నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబాయి పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Articles

Latest Articles