టీఎంసీలో చేరిన భారత మాజీ క్రికెటర్‌

ఏరాష్ర్టంలో చూసిన రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార పార్టీ అక్కడి ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి ఆయా నాయ కులను చేర్చుకునే పనిలో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల వరకు రాష్ట్రస్థాయి పార్టీగా ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఇపుడు జాతీయ పార్టీగా మారుతోంది. ఇదే క్రమంలో ఆయా రాష్ట్రాల్లో శాఖలు ఏర్పాటు చేస్తున్నారు బెంగాల్​ సీఎం, పార్టీ చీఫ్​ మమతా బెనర్జీ. ఇటీవల గోవాలోనూ ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడి ప్రచారం లో భాగంగా భారత టెన్నిస్​ ప్లేయర్ లియాండర్​ పేస్ ​ సైతం టీఎంసీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఓ భారత మాజీ క్రికెట్​ ఆటగాడు కీర్తీ ఆజాద్ సైతం టీఎంసీలో చేరారు. బిహార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్‌ (TMC)లో చేరారు. కీర్తి ఆజాద్ చేరికతో టీఎంసీ పార్టీ మొట్టమొదటిసారిగా బిహార్‌లో అడుగు పెట్టినట్టయింది. 2024 ఎన్నికల కోసం మమతా పార్టీ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టీఎంసీని విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. 1983 క్రికెట్ వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్ బీహార్ రాష్ట్రంలోని దర్బంగా స్థానం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచారు.

Related Articles

Latest Articles