ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 90 ఐ ఫోన్లు పట్టివేత….

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో లో 90 ఐ ఫోన్లు పట్టుకున్నారు అధికారులు. వాటి విలువ కోటి రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే దుబాయ్ నుండి ఢిల్లీ వచ్చిన ఓ పార్సల్ లో ఐ ఫోన్లు గుర్తించారు కస్టమ్స్ అధికారులు. బట్టల చాటున ఐ ఫోన్లు తరలిస్తున్నారు కేటుగాళ్లు. ఓ పార్సల్ లో బట్టలు వున్నట్లు కార్గో కు చేరుకున్న ఆ పార్సల్ పై అనుమానం రావడంతో స్కానింగ్ చేసిన అధికారులు బట్టల చాటున ఐఫోన్ల గుట్టును రట్టు చేసారు. ఆ ఐ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-