న‌లందా మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా క‌ల‌క‌లం: 87 మంది వైద్యుల‌కు క‌రోనా…

బీహార్‌లో క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.  పాట్నాలోని న‌లందా మెడిక‌ల్ కాలేజీ, ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న 87 మంది వైద్యుల‌కు క‌రోనా సోకింది.  క‌రోనా సోకివ వైద్య‌లుకు ల‌క్ష‌ణాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని, వారంతా ఆసుప‌త్రి క్యాంప‌స్‌లోనే ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్టు పాట్నా డిస్టిక్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ చంద్ర‌శేఖర్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవ‌లే పాట్నాలో జ‌రిగిన ఇండియన్ మెడిక‌ల్ అసోసియేష‌న్ కార్య‌క్ర‌మంలో అనేక మంది వైద్యులు పాల్గొన్నారు.  ఇందులో న‌లందా మెడిక‌ల్ కాలేజీ వైద్యులు కూడా ఉన్నారు.  

Read: కాలువ‌పాలైన మూడువేల లీట‌ర్ల మ‌ద్యం… ఎక్క‌డంటే…

అయితే, ఆ కార్య‌క్ర‌మంలో బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ కూడా పాల్గొన్నారు.  బీహార్‌లో పెద్ద ఎత్తున కేసులు న‌మోద‌వుతుండ‌టంతో క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది.  రాష్ట్రంలో మాస్క్‌ను త‌ప్ప‌నిసరి చేసింది.  మాల్స్‌, దుకాణాల్లో త‌ప్ప‌నిస‌రిగా భౌతిక‌దూరం పాటించాల‌ని ఆదేశాలు జారీ చేశారు.  థ‌ర్డ్ వేవ్ పై వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఎలాంటి విప‌త్తు ఎదురైనా ఎదుర్కొన‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.  

Related Articles

Latest Articles