సిమ్లాలో కుప్ప‌కూలిన భ‌వ‌నం… అప్ర‌మ‌త్త‌మైన అధికారులు…

సిమ్లాలో గ‌త కొన్ని రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  దీంతో కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి.  న‌గ‌రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు రోడ్ల‌న్ని జ‌ల‌మ‌యం అయ్యాయి.  కొండ‌ల‌కు అనుకొని ఉన్న భ‌వ‌నాల్లో నివాసం ఉంటున్న ప్ర‌జ‌లు భ‌యం భ‌యంగా కాలం గ‌డుపుతున్నారు.  ఎప్పుడు కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌తాయో, ఎప్పుడు భ‌వ‌నాలు కూలిపోతాయో తెలియ‌క ఆందోళ‌న చెందుతున్నారు.  అయితే, భారీ వ‌ర్షాల కార‌ణంగా ప‌గుళ్ళు ఏర్ప‌డిన ఓ 8 అంత‌స్తుల భ‌వ‌నం ఒక్క‌సారిగా కూలిపోయింది.  భ‌వ‌నానికి ప‌గుళ్లు రావ‌డంతో అందులో నివ‌శిస్తున్న ముందు జాగ్ర‌త్త‌గా ఆ భ‌వ‌నం నుంచి ఖాళీ చేయించారు.  భారీ భ‌వ‌నం కూలిపోవ‌డంతో ఆ భ‌వ‌నం శిధిలాలు చుట్టుప‌క్క‌ల ఉన్న నివాసాల‌పై ప‌డ్డాయి.  అధికారులు అప్ర‌మ‌త్తం కావ‌డంతో పెనుప్ర‌మాదం నుంచి ప్ర‌జ‌లు బ‌య‌ట‌ప‌డ్డారు.  ఎక్క‌డా ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గలేద‌ని అధికారులు చెబుతున్నారు.  

Read: విచిత్రం: స్పానిష్ ఫ్లూ స‌మ‌యంలో జ‌న్మించి… క‌రోనాకు త‌లొంచిన బామ్మ‌…

-Advertisement-సిమ్లాలో కుప్ప‌కూలిన భ‌వ‌నం... అప్ర‌మ‌త్త‌మైన అధికారులు...

Related Articles

Latest Articles