సంక్రాంతి బరిలో 8 మంది వారసులు!

తెలుగు సినిమా రంగంలో వారసులకు కొదవలేదు. ప్రముఖ నటీనటుల కుమారులే కాదు నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణుల పిల్లలు సైతం హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి తాపత్రయ పడుతూ ఉంటారు. అయితే ఈసారి చివరి నిమిషంలో ‘ట్రిపుల్ ఆర్’ మూవీ సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంతో ఈ సీజన్ పై టాలీవుడ్ వారసులు కన్నేశారు. మూవీ మొఘల్ రామానాయుడు మనవడు, సురేశ్ బాబు తనయుడు రానా నటిస్తున్న ‘1945’ చిత్రం ఈ నెల 7న విడుదల కాబోతోంది. సరిగ్గా అదే రోజున సాయికుమార్ తనయుడు ఆది హీరోగా నటించిన ‘అతిథి దేవోభవ’ మూవీ రిలీజ్ అవుతోంది. ఇదే రోజున మరో నట వారసుడు సైతం జనం ముందుకు వస్తున్నాడు. అతనే శివాజీ రాజా కొడుకు విజయ్ రాజా. ఈ తండ్రీకొడుకులు నటిస్తున్న ‘వేయి శుభములు కలుగు నీకు’ సినిమా జనవరి 7న విడుదల కాబోతోంది. తమన్నా వ్యాస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్స్ రాథోడ్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Read Also : బ్రేకప్ టియర్స్ : లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న దీప్తి సునయన

చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతని మలి చిత్రం ‘సూపర్ మచ్చి’ జనవరి 14న విడుదల కాబోతోంది. అలానే సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న ‘హీరో’ చిత్రం సంక్రాంతి కానుకగా 15వ తేదీ జనం ముందుకు వస్తోంది. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్‌ సైతం ‘రౌడీ బాయ్స్’తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీ కూడా సంక్రాంతి బరిలోనే దిగబోతోంది. మరో నిర్మాత ఎమ్మెస్ రాజు కొడుకు, యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ నటించిన ‘7 డేస్ 6 నైట్స్’ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున తనయుడు నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతి వస్తోంది. నాగ్, చైతు కలిసి నటించిన ఈ సినిమాపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

Latest Articles