టీడీపీ నేత హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అందుకే హత్య-ఎస్పీ

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నేత తోట చంద్రయ్య హత్య కేసు కలకలం సృష్టించింది.. అయితే, హత్య జరిగిన 24 గంటల్లోనే ఈ కేసును ఛేదించారు పోలీసులు.. మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ప్రకటించారు.. ఈ హత్యకు ప్రధాన కారణం పాత తగాదాలు అని మా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు తెలిపారు.. మృతుడు తోట చంద్రయ్య మరియు ప్రధాన నిందితుడు చింతా శివ రామయ్య గుండ్లపల్లి గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారని.. మూడేళ్ల క్రితం మృతుడు, ముద్దాయి మధ్య వారి ప్రాంతంలో వేసే సిమెంట్ రోడ్డు విషయంలో గొడవలు జరిగాయని.. అప్పటి నుండే వారి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని.. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన గ్రామంలో తమ బంధువుల వేడుకకు హాజరైన తోట చంద్రయ్య… చింతా శివరామయ్యను చంపుతానని చెప్పాడని ప్రచారం జరిగినట్టు.. ఆ విషయం చింత శివరామయ్యకు బంధువుల ద్వారా తెలియడంతో.. అతను చంపడానికంటే ముందే నేనే చంద్రయ్యను చంపాలని శివరామయ్య, తన కుమారుడు మరియు ఆరుగురు అనుచరుల సహాయంతో నిన్న హత్య చేశారని వెల్లడించారు.

Read Also: బిగ్‌ బ్రేకింగ్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి జకోవిచ్‌ ఔట్

మొత్తంగా పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య చేశారని మా దర్యాప్తులో తేలిందన్నారు ఎస్పీ విశాల్‌ గున్నీ.. నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా దర్యాప్తు జరిపి నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.. పల్నాడు ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు… వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విశాల్ గున్నీ. ఇక, నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి… 1. చింత శివ రామయ్య, 2. చింత యలమంద కోటయ్య, 3. సాని రఘు రామయ్య, 4. సాని రామకోటేశ్వరరావు , 5. చింతా శ్రీనివాసరావు, 6. తోట ఆంజనేయులు, 7. తోట శివ నారాయణ, 8. చింతా ఆదినారాయణ.

Related Articles

Latest Articles