8.45 బిలియన్ డాలర్లకి అమ్ముడైన వందేళ్ల ‘హాలీవుడ్ సింహం’!

‘అమేజాన్’… ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఊతపదం! అంతలా మన జీవితాల్లోకి దూసుకొచ్చింది ఈ కామర్స్ దిగ్గజం. అయితే, అమేజాన్ అంటే ఏదో బుక్కులు, ఫోన్లు, కంప్యూటర్లు అమ్ముకునే వెబ్ సైట్ అనుకోటానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా, అమేజాన్ ప్రైమ్ వచ్చాక చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ అమేజాన్ కస్టమర్స్ అయిపోయారు! తన ప్రైమ్ ఓటీటీతో అమేజాన్ డిజిటల్ స్ట్రీమింగ్ ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ఎవరికీ ఏది కావాలంటే అది అమ్మే అమేజాన్… కొన్నిసార్లు కొంటోంది కూడా! భారీ డీల్స్ తో ఇప్పటికే చాలా దేశాల్లోని చాలా కంపెనీల్ని అమేజాన్ సంస్థ కొనేసింది. ఇప్పుడు హాలీవుడ్ ఫేమస్ బ్యానర్ ‘ఎంజీఎం’ కూడా వశమైంది…
అమేజాన్ ప్రైమ్, ఎంజీఎం కలవబోతున్నాయి. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ‘మెట్రో గోల్డ్ విన్ మేయర్’ (ఎంజీఎం)తో ప్రైమ్ కు భారీ డీల్ కుదిరింది. ‘బేసిక్ట్ ఇన్ స్టినిక్ట్, జేమ్స్ బాండ్, పోల్టర్ గీస్ట్, సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్, టూంబ్ రైడర్, ద పింక్ పాంథర్’ వంటి ఎన్నో వరల్డ్ వైడ్ హిట్స్ ని అందించిన గ్రేట్ బ్యానర్ 8.45 బిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది! అయితే, అంత డబ్బు సదరు పతాకం కోసం ఖర్చు చేయటం తప్పేం కాదు అంటున్నారు అమేజాన్ ప్రైమ్ ఉన్నతాధికారులు. ఎందుకంటే, వందేళ్ల కాలంలో 4వేలకు పైగా సినిమాలు రూపొందించారు ఎంజీఎం బ్యానర్ పై! 17వేల షోస్ కూడా నిర్మించారు! వాటన్నిటి వల్లా 180 అస్కార్ అవార్డులు, 100 ఎమ్మీస్ ఎంజీఎం స్వంతమయ్యాయి! మరి ఇంత ఘన చరిత్ర కలిగిన హిస్టారికల్ ప్రొడక్షన్ హౌజ్ కోసం కొన్ని బిలియన్ల డాలర్లు తక్కువే కదా!
అమేజాన్ ప్రైమ్ తో ఎంజీఎం అధికారిక విలీనం మరికొన్ని రోజుల్లో జరగనుంది. ప్రస్తుతానికి కేవలం ప్రకటన మాత్రమే వచ్చింది. అయితే, ఎంజీఎం అనగానే హాలీవుడ్ సినిమా ప్రియులకు గుర్తుకు వచ్చే గర్జించే సింహం చెక్కుచెదరదట! అలాగే, శతాబ్ద కాలం పాటూ ఎంజీఎం ఏ విధంగా అయితే టాలెంట్ కి, స్టోరీ టెల్లింగ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చిందో… ఇక మీదట కూడా అలానే కొనసాగుతుందట. దాంతో పాటూ అమేజాన్ ప్రైమ్ తో కలవటం హాలీవుడ్ మూవీ మేకింగ్ కంపెనీకి మరింత విస్తరణ అవకాశం లభించనుంది. దేశదేశాల్లో అమేజాన్ ప్రైమ్ వల్ల ఎంజీఎంకి కూడా ఎందరెందరో కొత్త ప్రేక్షకులు లభించనున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-