హైదరాబాద్‌లో దారుణం.. 13 ఏళ్ల బాలికపై 72 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 72 ఏళ్ల వృద్ధుడు 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం గాదె వీరారెడ్డి (72) అనే వ్యక్తి… బర్కత్‌పురలోని గోకుల్‌ధామ్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నాడు. 2010లో అతడి ఇంట్లో బాధితురాలి తల్లి పని మనిషిగా పని చేసేది. 2017లో ఆమెను బడంగ్‌పేటలోని తన ఓపెన్‌ ప్లాట్‌కు వాచ్‌మెన్‌గా నియమించుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలి తల్లి, ఆమె మేనమామ ఇద్దరూ కలిసి మీర్‌పేట పీఎస్‌ పరిధిలోని ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి బాధితురాలి తల్లి, మేనమామ అక్కడే ఉండేవాళ్లు. అయితే బాధితురాలి తల్లి ఇంటి పనులు మానేసి జీవనోపాధి కోసం టైలరింగ్‌ చేస్తుండేది.

Read Also: వైద్యం వికటించి ఐదు నెలల గర్భిణీ మృతి

ఈ నేపథ్యంలో నిందితుడు వీరారెడ్డి తన పుస్తకాలను భద్రపరిచేందుకు సంచులు కావాలన్న వంకతో తరచూ చిన్నారి ఇంటికి వెళ్తుండేవాడు. గత నెల డిసెంబర్‌లో బాధితురాలి తల్లి కుమార్తెను ఇంట్లో వదిలి స్వగ్రామానికి వెళ్లిన సమయంలో వీరారెడ్డి అక్రమంగా ఇంట్లోకి చొరబడి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఊరి నుంచి వచ్చిన తల్లికి బాధితురాలు ఈ విషయం చెప్పడంతో ఆమె మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

Related Articles

Latest Articles