భార్య‌కు ఆ పెద్దాయ‌న ప్రేమ‌కానుక‌… ఏంటో తెలిస్తే షాక‌వుతారు…

భార్య‌పై ఆయ‌న‌కు అమిత‌మైన ప్రేమ ఉన్న‌ది. అయితే, త‌న జీవితంలో ఎక్కువ స‌మ‌యం సంపాదించేందుకు క‌ష్ట‌ప‌డ్డాడు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసి పిల్ల‌ల‌కు అందించాడు. పిల్ల‌లు ప్ర‌స్తుతం వ్యాపారం చూసుకుంటుండ‌గా, 72 ఏళ్ల పెద్దాయ‌న త‌న భార్య‌కు అద్భుత‌మైన బ‌హుమ‌తి ఇవ్వాల‌ని అనుకున్నాడు. అందిరిలా కాకుండా ఆ వ‌య‌సులో కూడా ఢిఫ‌రెంట్‌గా ఆలోచించి ఓ ఇంటిని నిర్మించాడు. ఆ ఇల్లు గోడ‌లు ఆకుప‌చ్చ‌ని రింగులోనూ, పైక‌ప్పు ఎరుపు రంగులో ఉండేలా తీర్చిదిద్దాడు. అయితే, అన్ని ఇళ్ల కంటే ఈ ఇల్లు ఢిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఈ ఇల్లు ఉన్న చోట నుంచి 360 డిగ్రీల కోణంలో తిర‌గ‌గ‌లుగుతుంది. ఎటు కావాలి అంటే అటు గుండ్రంగా రివాల్వింగ్ చైర్ మాదిరిగా తిరుగుతుంది. ఇది నిజంగా అద్భుతం అని చెప్పాలి. ఆయ‌న పెద్ద‌గా చ‌దువుకోలేదు. టెక్నాల‌జీ గురించి పెద్ద‌గా అవ‌గాహ‌న లేదు. కానీ, భార్యకు అంద‌మైన‌, అద్భుత‌మైన బ‌హుమ‌తి ఇవ్వాలి అనుకున్న వెంట‌నే ఇంటికి నిర్మించాడు. త‌న భార్య ఇంట్లో కూర్చొని అన్ని వైపులను చూసే విధంగా ఇంటిని నిర్మించాడు. ఈ ఇల్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Read: ఆయుధ‌పోటీ ఇలానే కొన‌సాగితే… మ‌రో ప్ర‌చ్ఛ‌న్నయుద్ధం త‌ప్ప‌దా?

Related Articles

Latest Articles