సంక్రాంతి బరి నుండి తప్పుకున్న ‘7 డేస్ 6 నైట్స్’

గత యేడాది ‘డర్టీ హరి’ మూవీ కోసం చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టుకున్న ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు, ఆ సినిమాకు వివిధ ప్లాట్ ఫామ్స్ లో వచ్చిన స్పందనతో వెంటనే మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. అదే ‘7 డేస్ 6 నైట్స్’ మూవీ. దీన్ని సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై సుమంత్ అశ్విన్, ఎస్. రజనీకాంత్ నిర్మించారు. వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు.

బ్యాచిలర్ ట్రిప్ కోసం గోవాకి వెళ్లిన ఇద్దరు యువకులు, ఇద్దరు యువతుల చుట్టూ జరిగే కథతో ఈ సినిమాను ఎమ్మెస్ రాజు తెరకెక్కించారు. నూతన నటీనటులతో పాటు సుమంత్ అశ్విన్ సైతం ఇందులో నటించాడు. సమర్థ్ గొల్లపూడి సంగీతం సమకూర్చిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ఎమ్మెస్ రాజు భావించారు. కానీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడీ ఆలోచనను విరమించుకున్నారు. వీలుచూసుకుని తమ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు.

Related Articles

Latest Articles